top of page

రాచమల్లు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 4
  • 1 min read

రాచమల్లు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సమావేశానికి హాజరైన వైసీపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు
సమావేశానికి హాజరైన వైసీపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


డీఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ కోరుతూ, అందుకు కారకుడైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీ ఎంబర్సిమెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈ నెల 6వ తేది నుంచి భవిష్యత్ కార్యాచరణ గురించి వై.యస్.ఆర్.సి.పి శ్రేణులకు వివరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తూ, శక్తి వంచన లేకుండా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పోరాడాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని కార్యకర్తలకు మరియు నాయకులకు భరోసాను ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page