రూ. లక్ష కే 100 గ్రాముల బంగారు... బురిడీ కొట్టించిన కేటుగాడు కన్నయ్య...
- VOICE OF HERALD

- 20 hours ago
- 1 min read
లక్ష రూపాయలకే 100 గ్రాముల బంగారు అంటూ అమాయకులకు బురిడీ కొట్టించిన కేటుగాడు కన్నయ్య

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తక్కువ ధరకే బంగారం ఇస్తానని మోసం చేసిన కేటుగాడిని, బాధితుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు ఏఎస్పి విభూ కృష్ణ ఐపీఎస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్ష రూపాయలకే 100 గ్రాముల బంగారు తయారు చేసి ఇస్తానని మాయమాటలు చెప్పి నకిలీ బంగారం అంట కట్టడమే కాకుండా, బాధితుడు రవికుమార్ వద్ద నుండి దాదాపు ఆరు లక్షల 50 వేల రూపాయలు కాజేసి ఆపై బెదిరింపులకు నిందితుడు కన్నయ్య అలియాస్ ప్రసాద్ పాల్పడినట్లు, కేటుగాడు కన్నయ్యను బిఎన్ఎస్ 318 (4) క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితుడిని వాసవి సర్కిల్ సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కేటుగాడు కన్నయ్య వద్ద నుండి నూరు గ్రాముల నకిలీ బంగారు కడ్డీ, ఒక ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అనుమానం కలిగిన పోలీసులను సంప్రదించాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పోలీసు వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఒకటో పట్టణ సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.





Comments