దేశ యువతకు సెల్యూట్ - కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా
- VOICE OF HERALD

- 21 hours ago
- 2 min read
దేశ యువతకు సెల్యూట్ - కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

ప్రొద్దుటూరు - 26 జులై 2026
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ప్రజాస్వామ్య ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. ఈ విజయాన్ని సాధించిన దేశ యువతకు హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు. విపక్ష నేత రాహుల్ గాంధీ పోరాటానికి దక్కిన విజయం అని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉగ్రవాదులతో పోల్చడం అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్య. నిరసన వ్యక్తం చేయడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అలాంటి రాజ్యాంగ హక్కును వినియోగిస్తున్న విద్యార్థులను ఉగ్రవాదులతో పోల్చడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే.
ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
మొదటిది, అప్పుడు నిరసన తెలిపిన విద్యార్థులు నిజంగానే ఉగ్రవాదులని ఇప్పటికీ భావిస్తున్నారా?
రెండవది, ఒకవేళ ఆ వ్యాఖ్య తప్పయితే దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా?
ఒకవేళ విద్యార్థులు ఉగ్రవాదులు కాదని అంగీకరిస్తే, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆయన నైతిక బాధ్యత. ఒకవేళ ఇప్పటికీ వారిని ఉగ్రవాదులేనని చెబితే, అలాంటి వారి ఒత్తిడితోనే కేంద్ర మంత్రి రాజీనామా చేశారా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ విద్యార్థుల ఉద్యమాన్ని అసాంఘిక శక్తులు హైజాక్ చేశాయని వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే, ఆ ఉద్యమం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడాన్ని ఆయన ఎలా వివరిస్తారు?
విద్యార్థుల డిమాండ్లు నిజమైనవా? కాదా? దీనిపై పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఒకవేళ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని అంగీకరిస్తే, ఉద్యమాన్ని హైజాక్ చేశారన్న వ్యాఖ్య సరైనది కాదని ఒప్పుకోవాలి. లేకపోతే ఆ వ్యాఖ్యకు ఆధారాలను దేశ ప్రజల ముందు ఉంచాలి.
ఈ ఉద్యమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశ యువతకు అండగా నిలిచి అలుపెరగని పోరాటం చేశారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న ఆయనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. గాంధీ కుటుంబానికి దేశం కోసం త్యాగాలు కొత్తవి కావు. శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకులు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ ఈ దేశ యువత హక్కుల కోసం రక్తం చిందిస్తూ నిరంతరం పోరాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది. ఢిల్లీలో అయినా, గల్లీలో అయినా, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వెనుకడుగు వేయదు.
రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి కేవలం రాహుల్ గాంధీ తోనే సాధ్యమవుతుందానే సత్యాన్ని గ్రహించాలని కోరారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను, ప్రజా సంక్షేమానికి అంకితమైన విధానాలను గుర్తించి రాహుల్ గాంధీని భారత ప్రధానమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆశయాలను నెరవేర్చగల నాయకత్వంగా శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేశారు.





Comments