top of page

ప్రజల సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు - ఇర్ఫాన్ భాష

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 19, 2025
  • 1 min read

ప్రజల సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు - కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ భాష

పనులు సమీక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష
పనులు సమీక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష

ప్రొద్దుటూరు: 19-నవంబరు-2025


ప్రొద్దుటూరు పట్టణంలోని 13వ వార్డు శ్రీరాముల పేటలో ప్రధాన కాలువకు వెళ్లే అప్రోచ్ కాలువలో వ్యర్థాలు సక్రమంగా తొలగించకపోవడంతో కాలువ దెబ్బతింది. దీంతో మురికినీరు రోడ్డుమీదికి చేరి వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిపోయిన మురికినీరు దుర్వాసనతో పాటు వాహనాలు జారిపడే ప్రమాదం కూడా పెరిగింది.


ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ భాష వెంటనే స్పందించారు. గతంలో మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతంలో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం వల్లే సమస్య మళ్లీ తీవ్రరూపం దాల్చిందని ఆయన పేర్కొన్నారు.


నిన్నటి రోజున మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అప్రోచ్ కాలువ మరమ్మత్తు పనులను తక్షణమే ప్రారంభించాలని ఇర్ఫాన్ భాష విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించిన ఆయన సూచనలపై కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది మరమ్మత్తు పనులను పునఃప్రారంభించారు.


ప్రజల సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు వేస్తూ, మురికినీటి నిల్వ తొలగింపు మరియు కాలువ మరమ్మత్తు పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్న నమ్మకం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పేద ప్రజలు మరియు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఇర్ఫాన్ భాష తెలిపారు.

CONTACT 9908051001
CONTACT 9908051001

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Jai
Nov 20, 2025
Rated 5 out of 5 stars.

Great work by people’s leader

Like
bottom of page