IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అక్షయకు అభినందనలు
- EDITOR

- 7 days ago
- 1 min read
IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అక్షయకు అభినందనలు

చిట్వేల్: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్‌కు చెందిన ఎన్సిసి క్యాడెట్ చెంజి అక్షయ పశ్చిమగోదావరి జిల్లా, ఆలంపూర్ సైనిక్ స్కూల్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్లో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ అక్షయను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్సిసిలో షూటింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన అక్షయ, వివిధ స్థాయిల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభను ప్రదర్శించి IGC స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం సాధించింది. ఈ ఎన్సిసి శిక్షణతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే కాక, విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్, ఉపాధ్యాయుని సోఫియా, మొదలగు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





Comments