top of page

ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక - కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 28
  • 1 min read

ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక - కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

పారిశుధ్య కార్మికుల మస్టర్ రోల్ స్వీయ పరిశీలన


కార్మికులను, సిబ్బందిని వార్డులు, సచివాలయం వారీగా మ్యాప్ చెయ్యాలని ఆదేశం


త్వరలో పట్టణ పరిధిలో ఉన్న వర్తక వ్యాపారస్థులతో సమావేశం


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సైకిల్ సవారి చేసారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో రోడ్లు, డ్రైన్స్, చెత్త ఉన్న పలు ప్రాంతాలను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. చికెన్, మటన్, హోటల్స్, టీ దుకాణాలను తనిఖీ చేసారు. చిరు వ్యాపారస్థులు, తోపుడు బళ్ళు యజమానులతో మాట్లాడారు. వ్యాపార కేంద్రాల్లో, అంగల్లో డస్ట్ బిన్స్ లేకపోవడన్ని గుర్తించారు. శ్రీరాములుపేటలో డ్రైన్స్ ద్వారా మురుగు రోడ్స్ మీదకు రావడన్ని గమనించారు. దీనికన్నా ముందు ఉదయాన్నే 5 గంటలకు కార్మికుల మస్టర్ రోల్స్ తనిఖీ చేసి ఫస్ట్ డివిజను పరిధిలో ఉన్న పారిశుధ్య కార్మికులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రొద్దుటూరులో పారిశుధ్య నిర్వాహణ మెరుగుపర్చడానికి పలు సూచనలు చేశారు. శానిటేషన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి కార్మికులను ప్రాంతాల వారీగా మ్యాప్ చేసి శానిటేరి సిబ్బందిని పర్యవేక్షించమని ఆదేశాలు జారీ చేశారు. సందర్బంగా కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రొద్దుటూరు ప్రజలు ప్రశంసించేలా మార్పు చూస్తారని, ఆసుపత్రి యాజమాన్యంతో,వర్తక వ్యాపారస్థులతో, తోపుడు బళ్ళు, హోటల్స్, టీ, కూరగాయలు, మటన్, చికెన్ దుకాణం యజమానులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణ సమర్ధవంతంగా జరగడానికి వారి సహాయ సహకారాలు తీసుకుంటామని కమీషనర్ అన్నారు. అనంతరం అన్నా కాంటీన్ ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page