top of page

సచివాలయ సిబ్బంది గైర్హాజరుపై కమిషనర్‌ ఆగ్రహం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 18
1 min read

సచివాలయ సిబ్బంది గైర్హాజరుపై కమిషనర్‌ ఆగ్రహం


స్వర్ణ సుబ్బిరెడ్డి కొట్టాల సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 18: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్వర్ణ సుబ్బిరెడ్డి కొట్టాల సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు.


తనిఖీ సమయంలో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పి. మునిహిమజ సచివాలయానికి హాజరు కాకపోయినప్పటికీ హాజరు పట్టికలో సంతకం చేసినట్లు కమిషనర్‌ గుర్తించారు. అదేవిధంగా సచివాలయంలో కొంతమంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయ సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం, హాజరు పట్టికలో అక్రమంగా సంతకాలు చేయడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్, సంబంధిత సిబ్బందిపై నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం ఉండకూడదని, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page