top of page

ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 2, 2023
  • 1 min read

ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న వారితో ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైసిపి ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టామని, అలాంటి ఒక కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి సహాయనిధిని ఏర్పాటు చేసి అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్జులు భరించలేని రాష్ట్ర ప్రజలకు భరోసాను కల్పిస్తూ వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా తిరిగి వారి ఖాతాలలో జమ చేయటం ప్రజలందరూ హర్షిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు 11 మంది లబ్ధిదారులకు 12 లక్షల 23 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page