సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరద
- VOICE OF HERALD

- Jun 28
- 1 min read
Updated: Jul 6
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 29వ విడత చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో రూ.11 కోట్లకు పైగా సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరులోని స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 61 మంది లబ్ధిదారులకు రూ.55.36 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1,302 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం అందించామని, 29 విడతల్లో కలిపి సుమారు రూ.11.34 కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో ప్రొద్దుటూరు నియోజకవర్గం 2, 3 స్థానాల్లో కొనసాగుతుండడం సంతోషకరమని పేర్కొన్నారు. పేదలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.




Comments