ఆపదలో ఉన్న పేదలకు సంజీవనిలా సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే వరద

ఆపదలో ఉన్న పేదలకు సంజీవనిలా సీఎంఆర్ఎఫ్: ప్రొద్దుటూరులో రూ.35.24 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత భరోసా కల్పిస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 31వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 46 మంది బాధితులకు మొత్తం రూ. 35,24,000 విలువైన ఆర్థిక సాయం చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధుల విడుదలలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రెండు, మూడో స్థానాల్లో నిలబెట్టామన్నారు. ఇప్పటివరకు 31 విడతల్లో మొత్తం 1,401 మంది నిరుపేద రోగులకు అండగా నిలుస్తూ సుమారు రూ. 12 కోట్ల 22 లక్షల 95 వేల మేర సీఎం సహాయనిధిని నేరుగా చేరవేశామని, వైద్య ఖర్చులతో కుదేలవుతున్న బడుగు బలహీన వర్గాలకు ఈ పథకం ఒక ఆశాదీపంలా ప్రాణదానం చేస్తోందని ఆయన కొనియాడారు.





Comments