రాజంపేటలో సీఎం సహాయనిధి చెక్కు అందజేత - కూటమి నేతల చొరవ
- EDITOR

- 6 days ago
- 1 min read
రాజంపేటలో సీఎం సహాయనిధి చెక్కు అందజేత - కూటమి నేతల చొరవ

కడప జిల్లా, రాజంపేట: నందలూరు మండలం టంగుటూరుకు చెందిన మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కుటుంబం సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరగా, స్థానిక జనసేన నాయకుడు ఈశ్వర్ వెంటనే స్పందించి జనసేన ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసుకికి విషయం తెలియజేశారు. ఆయన చొరవతో ఊటుకూరు మాజీ సర్పంచ్ ఎంఎల్ నరసయ్య ద్వారా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజుని సంప్రదించి CMRF కు దరఖాస్తు చేయించడం జరిగింది.
ఈరోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి వచ్చిన సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో "ఆరోగ్య ఆంధ్రప్రదేశ్" ను సాధించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ప్రజలకు అండగా ఉంటూ ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించి మనోధైర్యం నింపుతున్న జగన్ మోహన్ రాజు కృషిని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల టీడీపీ నాయకులు చుక్క యానాది, మందపల్లి రాజా, జనసేన నాయకులు వై. నవీన్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Comments