top of page

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 19, 2025
  • 1 min read

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

వైయస్సార్ కడప జిల్లా


కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి లో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చేనాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు.

కార్యక్రమంలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తిలకించిన సీఎం చంద్రబాబు, రైతులు. ఈ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీన మొదటి విడత నిధులు రైతుల ఖాతాలోకి జమ్మకాగా, నేడు రెండవ విడతగా 7వేల రూపాయలు చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేశారు. దీనికోసం దాదాపు 3135 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపిన కూటమి సర్కార్. రాష్ట్రంలో అర్హులైన రైతులకు 20 వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక చేయూతకు నిర్ణయం తీసుకున్నట్లు, మొదటి విడతలో ఈ ఏడాది ఆగస్టు 2న 7వేల రూపాయల చొప్పున 3174 కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాలో జమ చేసినట్లు రెండవ విడతలో 14 వేలు రైతుల ఖాతాలకు జమ చేసిన ప్రభుత్వం. కేవలం నాలుగు నెలల కాలంలోనే 6309.44 కోట్ల మేర అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page