సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం

సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం

ఈనెల 30వ తేదిన విశాఖ పట్నం సరస్వతి పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యకర్తల సమావేశం జగదాంబ సెంటర్ సిఐటియు ఆఫీసు లో జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్ కే ఎస్ వి కుమార్, & జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి ఏ రాజు, తుట్టా నూక రాజు అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి మున్సిపల్ కార్మికుల హైకోర్టులో కేసు వేసే విషయం, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాల అమలుకై, డెత్, రిటైర్మెంట్ పోస్ట్లుభర్తీ కోసం భవిష్యత్ పోరాటాలకు రెడీ అవ్వాలన్నారు. గొలగాని అప్పారావు, ముద్దాడ ప్రసాద్, జే ఆర్ నాయుడు, నక్క నాగరాజు, గణేష్, అప్పలరాజు, రాము, శ్రీర రవణ, ఆదినారాయణ, ఈశ్వరరావు, రత్నం, శ్రావణ్ కుమార్, వెంకట్రావు, శేషు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




Comments