top of page

చౌటపల్లి లో ఘనంగా దేవర మహోత్సవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 8, 2023
  • 1 min read

చౌటపల్లి లో ఘనంగా దేవర మహోత్సవం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి గ్రామం నందు ఆదివారం ఉదయం వైసీపీ యువ నాయకులు రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 48 సంవత్సరాల తర్వాత ఘనంగా పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో పెద్దమ్మ, చిన్నమ్మ అమ్మవారి దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి విశిష్ట పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నలవల శివారెడ్డి, చైతన్య, శివారెడ్డి, గురునాథ్ రెడ్డి, పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు, చౌటపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page