top of page

వరద ఆధ్వర్యంలో టిడిపిలో భారీ చేరికలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 15, 2024
  • 1 min read

వరద ఆధ్వర్యంలో టిడిపిలో భారీ చేరికలు



వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి ల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మార్తల ఈశ్వరమ్మ, లక్ష్మీరెడ్డి, మరో వంద కుటుంబాలు టిడిపి లో చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి అధిష్టానం వరదరాజుల రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం ప్రజల స్వేచ్ఛ భావానికి నియోజకవర్గ అభివృద్ధికి సూచిక అని అన్నారు. రానున్న ఎన్నికలలో టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. టిడిపిలో చేరిన వారిలో స్థానిక నాయకులు రమణారెడ్డి, మధుసూదన రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బచ్చు నాగార్జునరెడ్డి, గురజాల చంద్ర, గండ్లూరు చంద్ర, దేవిరెడ్డి కొండారెడ్డి, ఆవుల చంద్రఓబుళరెడ్డి, సుబ్బారెడ్డి, దేవిరెడ్డి లక్ష్మిరెడ్డి, రమణారెడ్డి, గండ్లూరు రామప్రసాద్ రెడ్డి, తదితరులు ఉండగా, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page