top of page

చిట్వేలు ఎన్‌సీసీ క్యాడెట్లకు బంగారు పతకాలు

  • Writer: EDITOR
    EDITOR
  • 1 day ago
  • 1 min read

చిట్వేలు ఎన్‌సీసీ క్యాడెట్లకు బంగారు పతకాలు

పథకాలు మరియు ధ్రువపత్రాల పొందిన ఎన్సిసి విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు
పథకాలు మరియు ధ్రువపత్రాల పొందిన ఎన్సిసి విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు

చిట్వేలు, జూన్ 12:


తిరుపతి జిల్లాలోని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల, చిట్వేలు ఎన్‌సీసీ క్యాడెట్లు ఈనెల 1వ తేదీ నుండి పదవ తేదీ వరకు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలిపారు.


ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న కృషి, క్రమశిక్షణ, అంకితభావం ఈ విజయానికి కారణమని తెలిపారు.


ఈ సందర్భంగా ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా ప్రదర్శించి ఈ ఘనత సాధించారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పథకాలు సాధించిన వారిలో చెంజి అక్షయ, గోర్ల వైష్ణవి, దీక్ష, హర్షప్రియ, గీతిక ఉన్నారు.


బంగారు పతకాలు సాధించిన క్యాడెట్లను ఉపాధ్యాయుని ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు మరియు తోటి విద్యార్థులు అభినందించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page