జాతీయ స్థాయి ఈబీఎస్బీ శిబిరానికి ఎంపికైన చిట్వేల్ ఎన్సీసీ క్యాడెట్లు

జాతీయ స్థాయి ఈబీఎస్బీ శిబిరానికి ఎంపికైన చిట్వేల్ ఎన్సీసీ క్యాడెట్లు

చిట్వేలు, జూన్ 23:
తిరుపతి జిల్లా చిట్వేలులోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూపుకు చెందిన ఆరుగురు ఎన్సీసీ క్యాడెట్లు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (EBSB)" శిబిరానికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి దుర్గరాజు , ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలిపారు.ఈ శిబిరం జూన్ నెల 24 నుండి జూలై 5 వరకు గుంటూరులో 12 రోజులపాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. క్యాడెట్లు తమ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, వివిధ ఎన్సీసీ కార్యక్రమాలలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జాతీయ స్థాయి శిబిరానికి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపికైన క్యాడెట్లను అభినందించారు. ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, క్యాడెట్ల కృషి, అంకితభావం ఫలితంగానే ఈ అరుదైన అవకాశం లభించిందన్నారు. ఈ శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ, సాహస క్రీడలు, జాతీయ సమైక్యతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. జాతీయ సమైక్యత, దేశంలోని విభిన్న సంస్కృతులపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బెటాలియన్ కంపెనీ హవల్ధార్ మేజర్ యమనప్ప, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎంపికైన క్యాడెట్లను అభినందిస్తూ, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




Comments