తిరుపతి గ్రూప్ స్థాయిలో జరిగిన తల్ సైనిక్ క్యాంప్ (టి ఎస్ సి) ఫైరింగ్ పోటీల్లో చిట్వేలు ఎన్‌సీసీ క్యాడెట్లు ఎంపిక
- VOICE OF HERALD

- Jul 4
- 1 min read
తిరుపతి గ్రూప్ స్థాయిలో జరిగిన తల్ సైనిక్ క్యాంప్ ( టి ఎస్ సి) ఫైరింగ్ పోటీల్లో చిట్వేలు ఎన్‌సీసీ క్యాడెట్లు ఎంపిక

తిరుపతి జిల్లా, చిట్వేలు
తిరుపతి గ్రూప్ పరిధిలో ఏడు ఎన్‌సీసీ బెటాలియన్ల మధ్య గ్రూప్ స్థాయిలో జరిగిన తాల్ సైనిక్ క్యాంప్ (TSC) ఫైరింగ్ ఎంపికల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేలుకు చెందిన ముగ్గురు ఎన్‌సీసీ క్యాడెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలియజేశారు.
ఎంపికైన క్యాడెట్లు:
- గోర్ల వైష్ణవి
- చెంజి అక్షయ
- రామిశెట్టి కుషాల్
ఫైరింగ్ విభాగంలో కచ్చితత్వం, క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ముగ్గురు క్యాడెట్లు తిరుపతి గ్రూప్ స్థాయిలో జూన్ నెల ఒకటి నుండి 10వ తేదీ వరకు మోహన్ బాబు యూనివర్సిటీలో కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో జరిగిన ఎంపికల్లో విజయం సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గారాజు ఎంపికైన క్యాడెట్లను అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. అసోసియేట్ ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ విజయం విద్యార్థుల కృషి, పట్టుదల మరియు నిరంతర సాధనకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఉన్నత స్థాయి ఎంపికల్లో కూడా ఈ క్యాడెట్లు విజయాలు సాధించి పాఠశాలకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. వీరు జూలై 4 నుండి 13 వరకు తిరుపతిలో జరిగే కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరం (సిఎటిసి ) 4 లో పాల్గొంటారని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు ఎంపికైన క్యాడెట్లను అభినందించి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుమల విశ్వనాథం, పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.




Comments