top of page

స్వతంత్ర దినోత్సవం నాడు మాంసాహార విక్రయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 15, 2024
  • 1 min read

స్వతంత్ర దినోత్సవం నాడు మాంసాహార విక్రయం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు ప్రతాప్ రెసిడెన్సి ప్రక్కన ఉన్న చెన్నూరు శివరాం దమ్ బిర్యాని రెస్టారెంట్ నందు స్వతంత్ర దినోత్సవం నాడు విచ్చలవిడిగా మాంసాహారం అలాగే చికెన్ మరియు మటన్ బిర్యానీలు విక్రయించటం పలువురు దేశభక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వతంత్ర దినోత్సవం నాడు మాంసాహార విక్రయాలు జరపకూడదని, కోళ్లు, మేకలు, పొట్టేలు వంటి జంతు జీవ జాతులను వధించరాదని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ లెక్కచేయని చెన్నూరు శివరాం దమ్ బిర్యాని యాజమాన్యం యదేచ్చగా మాంసాహార విక్రయాలు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు? ఇలాంటి వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page