top of page

నిరాశ్రయులకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ

Writer: EDITOR
EDITOR
Apr 8, 2023
1 min read

నిరాశ్రయులకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ

భోజనం ప్యాకెట్లను అందజేస్తున్న ప్రణయ్, ప్రణీత

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


విశాలాంధ్ర విలేఖరి భాస్కర్ సోదరుడు బచోటి రామకృష్ణ రెండవ వర్ధంతి సందర్భంగా ఆకలితో అల్లాడుతున్న నిరుపేద నిరాశ్రయులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా శనివారం పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, పాత బస్టాండ్ తదితర ప్రాంతాలలో ఉన్నటువంటి అభాగ్యులకు బచ్చోటి ప్రణయ్ దీప్, బచ్చోటి ప్రణీత లు అల్పాహారం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరుగా నిలిచి, తమ హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న వారి పెద్దనాన్న బచ్చోటి రామకృష్ణ భౌతికంగా తమ నుంచి దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ రెండవ వర్ధంతి సందర్భంగా నిరుపేద అభాగ్యులకు అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో నిరుపేద అభాగ్యులను ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page