top of page

నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 4, 2023
  • 1 min read

నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ

ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి!

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమవుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గత ఏడాదిగా జోరుగా నడుస్తోంది. ఇటీవల ఆ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page