top of page

మహిళా పోలీసుల దుస్తులు లాగడాన్ని ఎలా సమర్థించుకుంటారు? - చంద్రబాబు

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 10, 2023
  • 1 min read

మహిళా పోలీసుల దుస్తులు లాగడాన్ని ఎలా సమర్థించుకుంటారు? - చంద్రబాబు

అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఏపీలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దాడిలో వైకాపా కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేరస్థుడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page