top of page

పులివెందుల పసుపుమయం... చంద్రబాబుకు ఘన స్వాగతం

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 2, 2023
  • 1 min read

పులివెందుల పసుపుమయం..

చంద్రబాబుకు ఘన స్వాగతం

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పులివెందులలో ఘనస్వాగతం లభించింది. పులివెందుల ముఖద్వారం వద్ద పార్టీ నేతలు బీటెక్‌ రవి, రాంగోపాల్‌రెడ్డి తదితరులు గజమాలతో ఘనస్వాగతం పలికారు..


ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నీరాజనం పట్టారు. పులివెందుల ముఖ ద్వారం నుంచీ పూలంగళ్ల సెంటర్ వరకూ ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు రోడ్ షోలో ముందుకు సాగారు. తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పార్టీ జెండాలతో పులివెందుల పసుపుమయంగా మారింది. పులివెందుల పూలంగళ్లు సెంటర్ లో 'సైకో పోవాలి...సైకిల్ రావాలి' పాటకు యువత చిందులు వేశారు. బత్తాయిల దండతో చీనీ రైతులు చంద్రబాబుకు స్వాగతం పలికారు..


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page