చలో ఢిల్లీ డిసెంబర్ 1,2,3 తేదిల కార్యక్రమం జయప్రదం చేయండి

చలో ఢిల్లీ డిసెంబర్ 1,2,3 తేదిల కార్యక్రమం జయప్రదం చేయండి

కార్మిక హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం, ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షణ కోసం, జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అగనంపూడి జోనల్ ఆఫీస్ ఆవరణలో పారిశుద్ధ్యం కార్మికుల విస్తృత సమావేశం నిర్వహించారు. గొలగాని అప్పారావు గాజువాక, అగనంపూడి, పెందుర్తి జోన్లో బాధ్యుల కార్యదర్శి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, 4 లేబరు కోడ్లను రద్దు చేయాలని వేతనాలు పెంచాలని, డెత్,& రిటైర్మెంట్ ఖాళీ పోస్ట్లు కార్మికుల బిడ్డల వారసులచే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని శాశ్వత స్వభావం కలిగి కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ వర్కర్స్ కు ప్రభుత్వం రెగ్యులర్ చేసి పర్మినెంట్ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నక్క నాగరాజు అధ్యక్షులు, ఎన్. రాజు, సత్యవతి, నాగమణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు



Comments