top of page

చైన్ స్నాచర్ చేతివాటం, ఐదు నెలల పసికందు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 16, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, రామచంద్రాపురంలో దారుణం చోటుచేసుకొంది.

వివరాల్లోకి వెళితే బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటనలో ఐదు నెలల పసి కందు మృతి చెందాడు, వేసవి కాలం కావటం చేత మేడపైన నిద్రిస్తున్న దంపతులు, భార్య భారతి మెడలోని బంగారు గొలుసును టార్గెట్ చేసి మాటువేసి చైన్ స్నాచర్, తెల్లవారుజామున మహిళ మేడపై నుండి క్రిందికి దిగుతుండగా మెడలోని బంగారు గొలుసును గట్టిగా లాగిన దుండగుడు, ఈ క్రమంలో భయాందోళనకు గురి అయ్యి చేతిలోని బిడ్డను వదిలేసిన తల్లి మేడపై నుండి బిడ్డ క్రింద పడటంతో అక్కడికక్కడే మృతి. దిగ్భ్రాంతి కలిగించిన సంఘటన శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page