top of page

గంట వ్యవధిలోనే చైన్ స్నాచర్ పట్టివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 3, 2022
  • 1 min read

గుంటూరు అర్బన్ జిల్లాలోని మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విశదల గ్రామము వద్ద ఉన్న ఎన్నారై కాలేజ్ లో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కార్తీక్ రెడ్డి తల్లి ముక్కల రజనీ, కాలేజీలో ఫీజు కట్టి తిరిగి విశదల అడ్డ రోడ్డు వైపునడుచుకుంటూ వెళ్తున్న సమయంలో, ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె మెడలోని చైన్ స్నాచింగ్ చేసి వెళ్లి పోగా, వెంటనే ఆమె మేడికొండురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా స్టేషన్ సిఐ సిబ్బంది తో రంగం లోకి దిగి, ముద్దాయి అయిన పున్న మల్లికార్జున రావు ను నేరం జరిగిన గంటలోపే ఎంతో చాక చక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ IPS మేడికొండూరు పోలీస్ సిఐ కె.మారుతి కృష్ణ ని మరియు కేసులో సహరించిన స్టేషన్ సిబ్బంది SI నరహరి ని, కానిస్టేబుల్స్ నజీర్, గోపాలకృష్ణ, డేవిడ్, సిద్ధయ్య, రామారావు లను అభినందించినారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page