top of page

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 6, 2023
  • 1 min read

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు. ‘‘తితిదేకి నా సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను’’ అని చాగంటి వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తితిదే ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, చాగంటి పదవిని తిరస్కరించిన అంశానికి సంబంధించి తితిదే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page