top of page

కారు అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 30, 2024
  • 1 min read

కారు అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు

వైయస్సార్ కడప జిల్లా, పులివెందుల


పుట్టపర్తి లో శ్రీ సత్య సాయి బాబా సమాధిని దర్శించుకుని వెను తిరిగి వస్తున్న ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన జయరామిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అంబకంపల్లి వద్ద కారు వేగం అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి దూసుకుని వెళ్లి చెట్టును ఢీకొనగా, వాహన చోదకుడు జయరామిరెడ్డి తో పాటు ఆయన భార్య, అత్తకు తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నల్లబోతుల మధుసూదన్, హోంగార్డ్ వీరాంజనేయులు విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన ముగ్గురిని చికిత్స కొరకు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియ రావలసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page