top of page

సాగర్ మెయిన్ కెనాల్ లో కారు బోల్తా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 11, 2022
  • 1 min read

గుంటూరు, దుర్గి మండలం అడిగోప్పల గ్రామ పరిధిలోని సాగర్ మెయిన్ కెనాల్ లో కారు బోల్తా. కారులో పిన్నెల్లి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మదన్ మోహన్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి తమ్ముడు కావటంతో హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. దుర్గి మండలం ఎస్. ఐ పాల్ రవీంద్ర.. పోలీసులు గజ ఈత గాళ్ళు తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు, కారులో నుంచి బయటపడ్డ మదన్ మోహన్ రెడ్డి,

కారులో ఉన్న మదన్ మోహన్ రెడ్డి భార్య ,ఆయన కుమార్తె. భార్య లావణ్య చిన్న కూతురు సౌమ్య మృతి చెందారు.


పిన్నెల్లి మదన్ మోహన్ రెడ్డి కి గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య కూతురు మృతి చెందారు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. దగ్గరుండి గాలింపు చర్యలు చేపడుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page