top of page

కేకులు కూడా కల్తీ చేస్తున్నారా❓️

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 7, 2023
  • 1 min read

కేకులు కూడా కల్తీ చేస్తున్నారా❓️

ఈ దరిద్రులు ఎవరు.. కేకులు కూడా కల్తీ చేస్తున్నారు

రాజస్థాన్ నుంచి అక్రమంగా పాల పొడి రవాణా

ప్రమాదకర రసాయనాలతో కేకులు, స్వీట్ల తయారీ

సర్వం కల్తీమయమవుతున్నా ఈ రోజుల్లో కొన్ని పదార్థాలైనా కల్తీ లేకుండా చేస్తారనే నమ్మకం ఉండేది. కొందరు అక్రమార్కులు ధనార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ.. కేక్లు, స్వీట్లను సైతం కల్తీ చేస్తున్నారు. అలాంటి సంఘటనలే హైదరాబాద్లో వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేక్లు తయారీ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రసాయన రంగులు వాడుతూ.. అపరిశుభ్ర వాతావరణంలో కేకులు తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడు సయ్యద్ వాసిఫ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓనర్ గోపాల కృష్ణ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

మరో చోట స్వీట్లు..

పాతబస్తీ మొఘల్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని లాల్ దర్వాజలోని ఓ ఇంట్లో కల్తీ పదార్థాలతో కలాకండ్, కోవా తదితర స్వీట్లను తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం బాల్ గోపాల్యోజన కింద అందిస్తున్న పాల పొడిని తెలంగాణకి అక్రమంగాకి తరలించి వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page