top of page

చంద్రబాబు విడుదల ఆకాంక్షిస్తూ బస్సు యాత్ర..

Writer: DORA SWAMY
DORA SWAMY
Oct 5, 2023
1 min read

చిట్వేలి నుంచి చంద్రబాబు విడుదల కావాలని అరుణాచలం కు బస్సుయాత్ర.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ మండల టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో.. చిట్వేలు మండలం లోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు గురువారం ఉదయం తమిళనాడులోని అరుణాచలం శ్రీమంజునాథ స్వామి సన్నిధికి బస్సు యాత్ర నిర్వహించారు.

కాకర్ల నాగార్జున మాట్లాడుతూ...

చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడిగా త్వరితగతిన విడుదలై జనసేనతో కలిసి నడుస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని కోరుతూ మండల పరిధిలోని మహిళలు తరలిరాగా ఈ బస్సు యాత్ర నిర్వహించామని అన్నారు.

..కాకర్ల కోటేశ్వరరావు, మాచిన రవీంద్ర, అక్కమగారి బాబు, కస్తూరి గిరీష, బుంగటావుల నాగేశ్వరమ్మ, చెంగమ్మ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గున్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page