top of page

ఈ అధికారులపై చర్యలు ఉండవా?

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 7, 2023
  • 1 min read

బ్రహ్మంగారి గర్భగుడిలో ఫోటోలు తీయవచ్చా.

బ్రహ్మంగారి గర్భగుడిలో ఫొటోస్ తీయకూడదు అనే విషయం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజికి తెలియదా... బ్రహ్మంగారి భక్తుల మనోభావాలను, భక్తులను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులపై చర్యలు ఉండవా, ఏంటి ఈ దారుణం.. అధికారులే ఇలా ప్రవర్తిస్తే... ఇక భక్తుల పరిస్థితి ఏంటి... జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రతిష్టలను సాక్షాత్తు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మరియు దర్శనానికి వచ్చిన అధికారులు మంటగలుపుతూ గర్భ గదిలోనే ఫోటోలు తీశారు.

ఎవరైనా భక్తులు తెలిసో తెలియక బ్రహ్మం గారి గర్భ గుడిలో ఫోటోలు తీస్తే అనేక రకాలుగా హంగామా చేసే సిబ్బంది... ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి... అసలు ఈ అధికారులకు బ్రహ్మం గారిమీద భక్తి భావాలు ఉన్నాయా.. లేవా.. బ్రహ్మంగారి గర్భ గుడిలో ఫోటోలు తీస్తే...వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. మరి ఈ అధికారులపై ఎవరు చర్యలు తీసుకోవాలి... పై అధికారులు వీరిపై తప్పకుండా చర్యలు తీసుకుంటే తప్ప... భక్తులు అపార్థం చేసుకోకుండా ఉంటారు...


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page