top of page

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 17, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఆదివారం సాయంత్రం పెన్నా నదిలో గల్లంతయిన వసంత్, కార్తీక్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వసంత్ మృతదేహం లభ్యం కాగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో కార్తీక్ మృతదేహం లభ్యమైంది అని ఎర్రగుంట్ల ఎస్సై నరసయ్య, అగ్నిపాపక శాఖ అధికారి రఘునాథ్ వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. కేసు నమోదు చేసిన ఎర్రగుంట్ల పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page