top of page

ప్రో మాక్స్, బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 30, 2024
  • 1 min read

ప్రో మాక్స్, బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కార్మికులకు కర్షకులకు ముందస్తు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు అనగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ప్రో మాక్స్ ఇంజన్ ఆయిల్, అలాగే ప్రొద్దుటూరు టూ వీలర్ బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్డు నందు గల ఎస్పీజీ చర్చ్ ఆవరణలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, కావున రక్తదానం చేయగల దాతలు తమ పేర్లను నమోదు చేసుకుని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 వరకు జరుగు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలి అంటూ టు వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యు అయూబ్ హుస్సేన్, అలాగే ప్రో మాక్స్ ఇంజిన్ ఆయిల్ డీలర్ రాజేంద్ర పిలుపునిచ్చారు. మే 1వ తేదీ ఉదయం వసంతపేటలోని బుసెట్టి కళ్యాణ మండపం నుండి బయలుదేరి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వరకు రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల కొరకు 9440273658 లేదా 9849062801 నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు. సమావేశంలో చంద్ర, శివ, రమణ, బాబు తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page