top of page

పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర రావు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jul 23
1 min read

శ్రీకృష్ణ గీతాశ్రమం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో గత దాదాపు ఆరు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం ఆందోళనకరమని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ, ఇన్‌కమ్ టాక్స్ సంబంధిత కారణాల వల్ల సంస్థ బ్యాంకు ఖాతాలపై పరిమితులు ఏర్పడటంతో జీతాలు చెల్లించలేకపోతున్నామని, మరో రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమై బకాయి జీతాలను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


ఉద్యోగులు ఆరు నెలల పాటు జీతాలు లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు, యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని వంకధార నరేంద్రరావు కోరారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఈ సందర్భంగా ఈవో శ్రీధర్ ను కలిసి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడి ఉద్యోగుల నుంచే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యను త్వరగా పరిష్కరిస్తామని సంబంధిత సిబ్బంది హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి చిరంజీవి రెడ్డి, పట్టణ కార్యదర్శి మురళీకృష్ణ, చరణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page