top of page

అత్యాచార ఘటనపై త్వరలో రాష్ట్ర డీజీపీ కి రెప్రెజంటేషన్ - బీజేపీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 13, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయంలో నేడు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు జరిగిన సంఘటనలోని నిజాలు బహిర్గతం చేయటం వలనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అత్యాచార ఘటనలో పోలీసులు వాస్తవాలు దాచి పెట్టారని, బాధిత మైనర్ బాలిక శింబు అనే వ్యక్తి పది మందితో అత్యాచారం చేశారని తెలిపిందని, కాగా పోలీసులు నలుగురినే అరెస్ట్ చేశారన్నారు, మిగిలిన వారిని గుర్తు తెలియని వ్యక్తులు అని చెబుతున్నారన్నారు. పై సంఘటనలో జిల్లా ఎస్పీ కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలో స్పెషల్ రిపోర్ట్ తీసుకొని FIR నమోదు చేయాల్సిన పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఒక పోలీసు ఆఫీసర్ ని కాపాడటానికి ఎస్పీ బాధ్యత తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై త్వరలో రాష్ట్ర డీజీపీ కి రెప్రెజెన్టేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page