top of page

ప్రొద్దుటూరు నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన బీజేపీ పట్టణ నాయకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 31
  • 1 min read

ప్రొద్దుటూరు నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన బీజేపీ పట్టణ నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర రావు ఈరోజు ప్రొద్దుటూరుకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌ టి. శ్రీనివాస్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, పట్టణంలోని పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా అన్నమయ్య విగ్రహం ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే అనుమతులు ఉన్న నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠకు మున్సిపాలిటీ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి, విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని సహకరిస్తామని హామీ ఇచ్చారు.


అలాగే, ఈ నెల 8వ తేదీన వర్షాభావ నివారణ కోసం పోతురాజు గడ్డ వద్ద నిర్వహించనున్న జలాభిషేక కార్యక్రమానికి మున్సిపాలిటీ నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరగా, ఆ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రొద్దుటూరు పరిధిలోని వీధుల్లో సంచరిస్తున్న నిరాశ్రయ ఆవుల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, అలాగే వాటిని అక్రమంగా తరలించే ఘటనలు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గోశాల ఏర్పాటు చేసి, ఆవులను అక్కడికి తరలించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కూడా కమిషనర్ సానుకూలంగా స్పందించి, అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకట్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎన్. కుమారి, పట్టణ ఉపాధ్యక్షురాలు రెడ్డి ప్రసన్న, మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, సీనియర్ నాయకులు వెంకటనారాయణ, చలపతిరావు, రామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page