top of page

పెన్నానదిలో వ్యర్థాల తొలగింపునకు బీజేపీ డిమాండ్: ప్రొద్దుటూరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 17
1 min read

పెన్నానదిలో వ్యర్థాల తొలగింపునకు బీజేపీ డిమాండ్: ప్రొద్దుటూరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణం మరియు పరిసర గ్రామ పంచాయతీల నుంచి సేకరిస్తున్న చెత్తాచెదారం, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను పెన్నానదిలో డంపింగ్ చేస్తూ నదిని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించి, నదీ కాలుష్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొద్దుటూరు మండల తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతూ నదీ జలాలు కలుషితమై ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిందని, అధికారులు స్వయంగా పరిశీలించి నదిలో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీలకు సరైన డంపింగ్ యార్డులను కేటాయించి, మున్సిపల్, మండల పరిషత్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పర్లపాడు గౌరీ శంకర్, జిల్లా సెక్రటరీలు సుధాకర్ రెడ్డి, జయలక్ష్మి, ప్రొద్దుటూరు పట్టణ అర్బన్-2 అధ్యక్షుడు పాలెం కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి విక్రాంత్, రూరల్ మండల అధ్యక్షుడు మురళి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పాల్, శ్యామ్ మరియు ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా పెన్నానదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page