top of page

రామేశ్వరం - వెళ్లాల గుడి వరకు బైకు ర్యాలీ - మాజీ ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2023
  • 1 min read

సోమవారం రామేశ్వరం నుంచి వెళ్లాల సంజీవరాయ స్వామి గుడి వరకు బైకు ర్యాలీ

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేతులకు సంకెళ్లు వేసుకొని టిడిపి శ్రేణులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కూడా కనీస వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రేపు సోమవారం రామేశ్వరం నుంచి వెళ్లాల సంజీవరాయ స్వామి గుడి వరకు బైకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరదరాజుల రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page