top of page

రాజకీయాలలో యువత చురుకైన పాత్ర పోషించాలి - యువ నాయకులు భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 13, 2023
  • 1 min read

రాజకీయాలలో యువత చురుకైన పాత్ర పోషించాలి - యువ నాయకులు భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో యువత రాజకీయాలలో ప్రవేశించి చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రొద్దుటూరు యువనేత భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం, పెన్నానగర్ శ్రీనివాస్ నగర్ లకు చెందిన యువకులు తన కార్యాలయంలో సూర్యను కలిశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు భూమిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యువతని రాజకీయాల్లోకి స్వాగతిస్తూ, రాజకీయాల్లో యువత ప్రాధాన్యత గురించి తెలిపారు. రాజకీయాలలో యువత ప్రధాన భూమిక పోషించాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాబోవు రోజుల్లో యువతకి రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తనతో పాటు కలిసి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page