ప్రారంభమైన భోగాపురం ఎయిర్‌పోర్టు... ప్రత్యేకతలు ఇవే...
- EDITOR

- Aug 1
- 1 min read
ప్రారంభమైన భోగాపురం ఎయిర్‌పోర్టు... ప్రత్యేకతలు ఇవే...

ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'ను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేశారు. విజయనగరం జిల్లాలో రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల్లో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు దేశంలోనే అత్యంత వేగంగా పూర్తైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. 3,800 మీటర్ల రన్‌వేతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగిన ఈ విమానాశ్రయం తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించనుండగా, భవిష్యత్‌లో 4 కోట్ల మందికి సేవలు విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. కార్గో, లాజిస్టిక్స్, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి రంగాలకు ఈ ప్రాజెక్టు కొత్త ఊపునివ్వనుంది. విమానాల రాకపోకలు ఈ నెల 17 అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.





Comments