top of page

మద్యం మతులో బిచ్చగాడి హత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 6, 2022
  • 1 min read

ఇడ్లి ఇస్తే విసిరేశాడంటూ బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు

గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు హోసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మే 1న అర్ధ రాత్రి సమయంలో మహేష్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి..తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇచ్చాడు. పొట్లం ఇస్తూనే..’నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావ్, పోలీసులతో జాగ్రత్త’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. మహేష్ మాటలకు బాధపడ్డ బిచ్చగాడు మహేష్ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్..అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్ తో కలిసి వచ్చి.. బిచ్చగాడిని కొట్టారు.


అది కూడా చాలదన్నట్టు బిచ్చగాడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి..అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లి ముగ్గరు..విచక్షణ రహితంగా బిచ్చగాడిపై దాడి చేశారు. దెబ్బలు తాళలేక బిచ్చగాడు అక్కడిక్కడే మృతి చెందాడు. బిచ్చగాడు మృతి చెందిన విషయాన్నీ గమనించి మహేష్, అనిల్, సతీష్ అక్కడి నుంచి పరారయ్యారు. బిచ్చగాడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమేరకు ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహేష్, అనిల్, సతీష్ లు స్థానికంగా ముఠా పనులకు వెళ్తుంటారని..ఇడ్లి ఇస్తే తినలేదని కారణంతోనే మద్యం మత్తులో బిచ్చగాడని కొట్టినట్లు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page