top of page

తారకరత్న మృతి తీరని లోటు - బత్యాల

Writer: EDITOR
EDITOR
Feb 20, 2023
1 min read

తారకరత్న మృతి తీరని లోటు - బత్యాల

బాలకృష్ణను పరామర్శిస్తున్న బత్యాల

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి తీరని లోటని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చంగలరాయుడు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాదు నగరంలో ఫిల్మ్ ఛాంబర్ లో గల నందమూరి తారకరత్న పార్థివ దేహానికి పూలమాలతో బత్యాల ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తారతరత్న కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ బాలకృష్ణ పురందేశ్వరిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ తారక రత్న నిగర్వి, నిజాయితీ గల వ్యక్తని అన్నారు. ఆయన మృతి జీర్ణించుకోలేనిదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మాజీ శాసన సభ్యులు ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page