top of page

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

Writer: EDITOR
EDITOR
Jul 29, 2023
1 min read

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా

బండి సంజయ్‌

భాజపా జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటుదక్కింది. తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది..


జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, కార్యదర్శిగా సత్యకుమార్‌ (ఏపీ)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page