top of page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 1, 2022
  • 1 min read

బద్వేలులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునగల భవాని 14 అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది స్థానిక పూసల వాడకు చెందిన భవాని బద్వేలు బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ద్విచక్ర వాహనం లో లిఫ్ట్ అడిగింది బాలికను ఎక్కించుకొని హై స్కూల్ కు వెళ్తుండగా స్థానిక సిద్ధవటం రోడ్డు లోని అగ్నిమాపక కేంద్రం వద్ద వేగంగా వచ్చిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది దీంతో బాలిక కిందపడి మృతి చెందింది రోజు బడికి వచ్చే విద్యార్థి భవాని మృతిచెందడంతో విద్యార్థులు తల్లడిల్లిపోయారు కూతురి మృతదేహాన్ని చూసి ఆమె తల్లి సుబ్బమ్మ బోరు బోరున పిలిపించింది సుబ్బమ్మ చెన్నయ్య దంపతులకు మృతి చెందిన భవాని మూడో సంతానమని సమాచారం ఈ ఘటనపై బద్వేల్ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page