top of page

అయ్యప్ప స్వామి లక్ష్యార్చన, గ్రామోత్సవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 1, 2023
  • 1 min read

అయ్యప్ప స్వామి లక్ష్యార్చన, గ్రామోత్సవం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


పెన్నానది తీరాన వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడచిన 30 సంవత్సరాలుగా ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయం నందు లక్షార్చన అలాగే గ్రామోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఇందులో భాగంగానే ఈనెల మూడవ తేదీన అనగా ఆదివారం నాడు అధ్యక్షుడు నామా రమేష్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో లక్ష్యార్చన పూజ, అలాగే 12వ తేదీ నాడు గ్రామోత్సవం కలదని, కావున పట్టణ, చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులగుదురని అయ్యప్ప స్వామి సేవా సంఘం, అమృత లింగేశ్వర సేవా సంఘం కమిటీ మెంబర్లు, సభ్యులు కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page