ఆటో ఢీ'కొని విద్యార్థిని మృతి
- VOICE OF HERALD

- Mar 9, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, వీరపునాయుని పల్లెలో అతివేగంగా వచ్చిన ఆటో బడికి వెళ్లే విద్యార్థినిని ఢీ కొనటంతో బాలిక అక్కడికక్కడే మృతి. వివరాల్లోకి వెళితే స్థానిక సంగమేశ్వర పాఠశాలలో ఏడవ తరగతి చదువుకునే మేఘన ఎప్పటిలాగే ఉదయాన్నే బడికి వెళుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన ఆటో మేఘనాను ఢీ కొనగా అక్కడికక్కడే మృతి చెందిన మేఘన. సంఘటనా స్థలానికి చేరుకున్న వీరపునాయుని పల్లె పోలీసులు, ఎస్.ఐ మధుసూధన రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.




Comments