top of page

ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి - సి ఐ మంజునాథ్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 14, 2023
  • 1 min read

ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి - సి ఐ మంజునాథ్ రెడ్డి

ఆటో డ్రైవర్లకు సూచనలు ఇస్తున్న సిఐ.

నందలూరు మండలంలోని బస్టాండ్ కూడలి లో రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ రెడ్డి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాల గురించి తెలియజేశారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా వారి యొక్క అనుమతులు పత్రాలను మరియు యూనిఫామ్ కచ్చితంగా పాటించాలని, అలాగే ఆటోలో ఓవర్ లోడ్ తో డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని వారు కట్టుబడితే వాహనాన్ని మరియు వారి లైసెన్స్ లను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు కనుక ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ నాయక్, కానిస్టేబుళ్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page