ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసిన యువతి
- VOICE OF HERALD

- Apr 29, 2022
- 1 min read
తనపై అత్యాచార యత్నం చేసిన ఆటో డ్రైవర్‌ని చితకబాదిన యువతి.
విజయవాడ, తనపై అత్యాచార యత్నం చేసిన ఆటో డ్రైవర్‌ని ఓ యువతి చితకబాదిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటో డ్రైవర్ యువతిని వెంబడించి అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆటో డ్రైవర్‌ను సదరు యువతి కర్రతో జాతీయ రహదారిపై చితకబాదింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కొంతమంది యువకులు యువతికి అండగా నిలిచారు.



Comments