top of page

కాంగ్రెస్ నేత నజీర్ పై భౌతిక దాడి... గాయాలతో ఆసుపత్రికి తరలింపు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 20
1 min read

ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేత పూల నజీర్‌పై భౌతిక దాడి: తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూల నజీర్‌పై కొందరు దుండగులు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తన సోదరుడి స్క్రాప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు, సామరస్య పూర్వకంగా మధ్యవర్తిత్వం వహించే నిమిత్తం పెద్దమనిషిగా వెళ్లిన ఆయనపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఆకస్మికంగా విరుచుకుపడ్డారు. ఈ దాష్టీకంలో నజీర్‌ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు అక్కడున్న ఇరు వర్గాలలోని మరికొందరికి కూడా రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వ్యాపారాలలో పోటీ తత్వం లావాదేవీల కారణంగానే దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

ఆదివారం మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై బాధితుడు నజీర్ స్పందిస్తూ.. తమ కుటుంబానికి నిందితుల నుంచి తీవ్ర ప్రాణహాని పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేకూర్చాలని పోలీస్ ఉన్నతాధికారులను అభ్యర్థించారు. కాగా, ఈ ఘర్షణకు గల పూర్తి నేపథ్యం, మూల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page